Friday, May 30, 2008

మహానగరం లో మృదులాంత్ర నిపుణుడి జీవితం

౧౯౮౦ ( 1980) తరువాత పుట్టిన మగవారు , ఆడవారు ఎవరైన సరే ఈ మృదులాంత్రపు జీవితం రుచి చూడాల్సిందే !

ఎందుకంటే మృదులాంత్ర పు ఉద్యోగ౦ అంత రుచిగా వుంటుంది . అందులో భాగంగా ఈ మహానగరం లో ........ గురించి రాయాల్సి వచ్చింది.



ఆ మహానగరమే మద్రాసు నేటి చెన్నై.....ఇక్కడివారికి హిందీ భాష అంటే పడేది కాదు ఒకప్పుడు, ఇప్పటికీ కొంతమందికి ఆ భాష అంటే ఇంతకు ముందు ఎప్పుడూ విననంతగా వింతగా చూస్తూ వుంటారు . ఉత్తర భారతదేశంనుంచి వచ్చిన వాళ్ళంటే మరీ వింత వీళ్ళకి......! ఇక్కడి వాళ్ళకి వీరి రాష్ట్రం వారు కాకుండా ఏ రాష్ట్రీయులు ఐన సరే వీళ్ళకి పరదేశీయులే......!



ఈ ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన ప్రజలందరు ఇక్కడ మృదులాంత్రపు ఉద్యోగం మీద తెగ రుచిమరిగారు ...!



వీళ్ళకి ఇక్కడికి దగ్గర్లో వున్న పాండిచ్చేరి (pondichery ) అంటే తెగ ఇష్టం ....! ఇక్కడ cheap గా దొరికే మత్తు పానీయాలు వీరికి మరెక్కడ దొరకవు కాబట్టి.....!



ఈ మద్రాసు నగరము లో సగం మంది ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చినవారే.....!

వీళ్ళకి ఇక్కడి జీవితం పంజరము నుంచి బయట పడ్డ చిలుక లాగ....! అడిగే వాళ్లు వుండరు ..అనుకునే వాళ్లు వుండరు..విచ్చలవిడి జీవితం ..ఎమి చేస్తారో వారికే తెలియదు...ఎందుకు చేస్తారో అసలు తెలియదు .....కాని ఏదో ఒకటి చేస్తారు..వీళ్ళల్లో మగవారికి జీతం ఇరువది వేలు దాటగానే కాళ్ళు , కళ్లు నేలమీద వుండవు...ఏదో కంపెనీ కి మేనేజర్ అయినట్టు తెగ హడావుడి చేస్తారు ...



సరే మనవాళ్ళు ఎక్కడికి వెళ్ళిన గాని ఇలాగే వుంటారు ...అది చెన్నై నగరమైన సరే చికాగో నగరమైన సరే ....



ఇక మనం చెన్నై నగరానికి ప్రాణం మృదులాంత్రపు భవనములు వుండే ఒమర్ (OMR (old mahabalipuram road )) కి వొద్దాము. ఈ రోడ్డు ద్విచక్ర వాహన దారులకు స్వర్గధామం...ఈ రోడ్డులో ఎక్కడ అయినా సరే చతుశ్చక్ర వాహనములు గాని ద్విచక్ర వాహనములు గాని ఆగి వుంటే వాటి మధ్య ఒక అడుగు ఖాళీగా వుంటే వాటి మధ్యలో దూరుతారు....అది వారికి ఇబ్బంది గా వున్నా సరే ....ఎదుటి వార్కి ఇబ్బంది అయిన సరే ....వాళ్ళకిపట్టదు.



ఇక ఈ రోడ్డు లోనే వెళ్ళే భారీ చతుశ్చక్ర వాహనముల (బస్) గురించి మాట్లాడుకుంటే T51 అని ఒక సర్వీస్ వుంది. ఆ బస్ రొండు లెదా మూడు లెదా అంతకంటే ఎక్కువ అంతస్తుల భవనం కనిపిస్తే చాలు డ్రైవర్ అంకుల్ కి కాలు వూరుకోదు. బ్రేక్ పడాల్సిందే .


సశేషం (ఇంకా వుంది)..........