మహానగరము లో మృదులాంత్ర నిపుణుడు-1
మా చెన్నై నగరంలో చాలా ఉన్నాయ్.
వాటిలో కొన్ని......
చెన్నై లో ఈ ఓల్డ్ మహాబలిపురం రోడ్ లో చాలా దృశ్యాలు చూడవచ్చు.మనం సరిగ్గ చుడాలి గాని ఇక్కడ కనిపించనివి అంటూ ఏమీ వుండవు..అన్నీ చుడొచ్చు. సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడ కుప్పలు తెప్పలు గ వుంటాయి.. వాటిలో పనిచేసే ఉద్యోగస్తులు ఆడవారు ,మగవారు గురించి చూద్దాం....
వీరికి పాపం వారానికి రొండు రోజులు శెలవులు... అదేనండి వీకెండ్....వీరు సోమవారం మళ్ళీ వారం మొదలయ్యింది అనే శాడ్నెస్స్ తో , మంగళవారం అప్పుడే ఒకరోజు ఐపోయింది అనే మాడ్నెస్స్ తో, బుధవారం వీకెండ్ కి ఇంకా రొండు రోజులు వున్నాయ్ అన్న బాధతో ,గురువారం శని,ఆదివారాల గురించి ఆలోచిస్తూ ,శుక్రవారం వీకెండ్ వచ్చిందన్న సంతోషంతో గడుపుతూ ఉంటారు.
వీరికి వారానికి నాలుగు రోజులు, మగవారికి ఇబ్బందిగా ఇన్ షర్ట్,అదెనండి టక్ చేసుకొని రావాలి పాపం ,మరి ఆడవారి సంగతి, వీళ్ళకి ఇప్పటిదాకా వేసుకొని డ్రెస్సులు, మోడరెన్ డ్రెస్సులు కొనుక్కుంటారు. ఇక శుక్రవారం వస్తే ఇద్దరికీ కొత్త ఆలోచన వస్తుంది. ఏంటంటే వాళ్ళు చిన్నప్పుడు కుట్టించుకున్న బట్టలు సరిపోవేమోనని ఆలోచన వస్తుంది అంతే ఆ బట్టల్తో దర్శనమిస్తారు వాటిని చూస్తే పాపం వాళ్ళు బీదవాళ్ళేమో అనుకుంటాం.....అది మనపొరపాటే.
ఇక పొతే ఈ దారి లోనే ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. బస్సుల్లో వెళ్తుంటే మన సాఫ్ట్వేర్ ఇంజినీర్స్ ని చూసి వీడేదో మన జాతికి చెందిన వాడు కాదు అని మన మీద సానుభూతి చుపిస్తారు.వాళ్ళే కాదు బస్సుల్లొ చాల మంది మన వంక అలాగే చూస్తారు...మన కుక్క బెల్ట్ లు సారీ ఐడి కార్డ్స్ మన వాలకం (జుట్టు పీక్కొని,గుడ్డలు (గడ్డాలు) మాసిపోయి, బట్ట తలలు, బస్సుల్లొ అంకుల్ అని పిలిచే పిల్లలు...........) మనం ఆ చూపులకి అలవాటు పడిపోయాము.
కొంతమంది చక్కగా నీట్ గ డ్రెస్స్ వేసుకొస్తారు...వారు బస్సులొ వున్నంత సేపు, ఆ డ్రెస్స్ వంకే చూసుకుంటూ రోజంతా గడుపుతారు.వీళ్ళని ఎవరూ అంటుకోకూడదు ... వీళ్ళని గురించి ఎవరు ఏమనుకున్నా వీరికి అనవసరం.వీళ్ళకి షూస్ ,బెల్ట్,పాంట్ ,షర్ట్ అన్నీ సరిగ్గా వున్నాయా లేదా చూస్తారు...లేకపొతే పక్కవారికి తుడిచి ఐనా క్లీన్ చేసుకుంటారు...
ఇంకా బస్ లో స్త్రీలు, పురుషులు వుంటారు.వీరిలొ కొంతమంది వుంటారు.వారు ఇంతకు ముందు ఒకరిని ఒకరు చూసుకోనంతగ చూస్తారు.మగవారు ఆడవారిని ఐతే అస్సలు ఇంత అందగత్తె ను ఇప్పటి దాకా చూడలేదు అన్నంతగా చూస్తారు...మరి స్త్రీలు ఏమైన తక్కువ తిన్నారా...అసలే మనకి దేనిలోనూ తీసిపోరు...(స్త్రీ సమాన హక్కు చట్టం)ఈ బకర గాడు బాగున్నాడే,ఆ బకరాగాడు పనికిరాడే...ఇవి వాళ్ళ సంభాషణలు...
సశేషం(ఇంకా ఉంది)...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment