అందరికి నమస్కారం...చాలా రోజుల తర్వాత మీ ముందుకు వస్తున్నాను.
ఈ సారి నా జీవితములో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన మీ ముందు వుంచుతున్నాను.
మీ అభిప్రాయాన్ని ఆచరిద్దామని.....ఈ బ్లాగ్ రాస్తున్నాను ...
నేను నా మొదటి ప్రేమ...గురించి మీకు చెప్దామనుకుంటున్నాను.
నా గురించి చెప్పే ముందు మీకు ఒక విషయం ఒకటి చెప్పాలి.నేను రాసే విషయాలన్ని.......మీద ప్రమాణం చేసి చెప్తున్న అన్నీ నిజాలే.
నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని.నాకు జీవితంలో దేవుడి దయవల్ల అన్ని వున్నాయి..అన్నీ అంటే ఒకటి లేదు..అదెనండి గర్ల్ ఫ్రెండ్...ఎక్కడ చూసిన ఎవరికైనా కనీసం ఒక్కరైన వున్నారు... కాని నాకు మాత్రం ఒక్కరు కూడ లెరు....అందుకే అప్పుడప్పుడు గుడికి వెళ్ళి దేవుడిని ఒకటి ఇమ్మని అడుగుతూ వుంటాను.
దేవుడికి నా గోల వినిపించిందెమో ఒకసారి నాకు ఒక అమ్మాయిని చూపించాడు.అంతే అప్పటినుంచి ఆ అమ్మాయినే చూస్తున్నాను...కానీ ఒకటే ఇబ్బంది...ఆ అమ్మాయే నా వంక చూసీ చూడకుండా..చూడకుండ చూసి నన్ను చూడనీయడంలేదు...ఏం చేయమంటారు...రోజూ ఆమె వెళ్ళే బస్ దగ్గరికి వెళ్ళి మరీ చూస్తున్నా.కాని ఉపయోగం లేదు.ఆమె దగ్గరికి వెళ్ళేంతలోపే తన దారి తాను చూసుకుంటుంది.నన్ను దగ్గరికి కూడ రానీయదు.
భగవంతుడు వీళ్ళని ఎందుకు సృష్టించాడో గాని మరి, మళ్ళీ సృష్టించి వారికి మాటలికి,చేష్టలకి అర్ధాలు వేరుగా పెట్టాడు.ఏం చేస్తాం మన కళ్ళు వాళ్ళని చూడందే వూరుకోవు.ఏమైన అంటే ఈ భగవంతుడి సృష్టి అద్భుతం అంటారు.ఏమోనండి...ఈ బ్లాగ్ చదివే వాళ్ళు ఎవరైన ఆడవాళ్ళు వుంటే దయచేసి చెప్పండి.ఆడవాళ్ళు వాళ్ళని చూసే వాళ్ళని కాదని ఎవరినో ఎందుకు చూస్తారండి...?
మరి నా విషయానికి ఒద్దాము. నేను చాలా రోజులుగా వెంట తిరుగుతున్నాను.నా వంక చూస్తుంది....నేను నవ్వితే నవ్వదు.ఏమో అదేమి రోగమో పాపము...కనీసం చూసి నవ్వడానికి కూడ పనికి రానేమో నేను...
చాల రోజులు ఆమె వెంటే తిరుగుతున్నాను కదా...! కనీసం ఒక్కసారి తిరిగి చూసి ఒక నవ్వు పడేస్తే వరదబాధితుడికి పులిహోర పొట్లం దొరికినంతగ ఆనందిస్తాను.
అసలు ఈ గోలంత ఎందుకు వచ్చిందంటే నేను ఇంతకుముందు రాసిన చెన్నై నగర బ్లాగ్ లో రాసేందుకు బస్ సర్వీస్ గురించి గమనిస్తుండగా ఈమెని చూసాను.అంతే నాకు వెంటనే ఎదో చేయాలనిపిచింది. ఏమీ చేయలేక మనసు పారేసుకున్నను.అంతే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అన్నీ మర్చిపొతున్నా.నన్ను తప్ప.గుడికి వెళ్ళటం కూడా మానేసాను.ఏమైన సరే ఈ సారి గుడికి వెళ్ళీ నా వంక చూడమని, నాతో మాట్లాడాలని...ఇంకా నన్ను ప్రేమించాలని ఆమెకి దండం పెట్టుకుంటాను.
సినిమాలల్లో చూపిస్తే అంతా చూడ్డానికే అనుకున్నను.కానీ మనము కూడా కొంచెము ట్రై చెయ్యొచ్చు అనిపించింది.చేసాను. ఏది నా మనసు విప్పి అమె ముందు చాప పరిచినట్లు పరుద్దామంటే నాకు ఒక్క అవకాశం కూడా ఇవ్వట్లేదు.
అసలు మొదట ఒక తప్పు జరిగిందిలెండి.నేను మనసు పారేసుకునేటప్పుడు చూసి పారేసుకోవద్దూ...!చూడలేదు.అక్కడ వచ్చింది అసలు ప్రాబ్లం.అమె తమిళ భాషా నేను తెలుగు భాషా...ఇద్దరికి కమ్మ్యూనికేషన్ సరిగ్గ లేదు.అందుకే నేను ఒక గొప్ప పని చేసాను. తమిళ్ ఇన్ తర్టీ డేస్ పుస్తకం కొన్నాను...ప్రస్తుతం ఆ పనిలో నిమగ్నమై వున్నాను. తదుపరి బ్లాగ్ లో తప్పకుండా తమిళ్ మీకు కూడా నేర్పిస్తాను...
Subscribe to:
Post Comments (Atom)
9 comments:
బావుందండి త్వరగ రాయండి... మేము వేఇట్ చేస్తాం..
నాది ఇదే ప్రాబ్లం మాస్టారు. ఈ తమిళ ఆమ్మాయిలతో ఇదే గొడవండి...... మీరే నాకు కుడా ఒక దారి చూయిస్తారని ఆశిస్తున్నా.... :-)
balu garu hi.....
baundi mee story.....
varada badhitulaku polihora potlam soooper...........
next tapa kosam waiting ikkada....
post it sooon....
meenu
paapam enni kashTaalO... meeku muppai rojullO kaakunDa mooDu rOjullOnE tamil vachchEyaalani kOrukunTunnaa..
బావుందండి :)
ఇలాగే ఓ పదేళ్ళ క్రితం, అర్థంకాక, అయోమయంతో, ఆకలిదప్పులతో అలమటిస్తూ ఉండగానే మన హీరొయిన్ను మరో హీరో కొట్టేసి మనల్ని 'శరత్ బాబు 'ని (సినిమా చివర్లో హీరొయిన్ను త్యాగం చేసే క్యారక్టర్ ఆర్టిస్టు) చేసాడు :(
సాహసం చేయరా ఢింబకా! ఆ కన్నె నిన్ను వరిస్తుంది!
బాలు గారు బాగుంది కాని జాగ్రత్త. త్వరలో రిజల్ట్ చెప్పండి....
@rajkumar
కృతజ్ఞతలండి రాజ్ కుమార్ గారు...మీ నిరీక్షణకు త్వరలోనే తెర దించుతాను...
@వర్మ
వర్మ గారు మీరు అడిగినట్లు నాకు కూడా త్వరలోనే చెప్పాలని వుంది... కాని ఆ వనితా దేవత ఎప్పటికి కరుణిస్తుందో తెలీదు కదండి...
Post a Comment